‘చంద్రబాబు జీవితంలో​ మళ్లీ సీఎం కాలేరు’

20 Jul, 2022 15:58 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

సాక్షి, విశాఖపట్నం: జీవితంలో​ చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళా పక్షపాతిగా సీఎం జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జనం.. టీడీపీ మహిళా నేత అనిత పేరు చెబితే అబద్ధాల అనిత ...అబండాల అనిత అంటారంటూ ఆమె దుయ్యబట్టారు. ఐరన్ లెగ్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు.
చదవండి: టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

‘‘వైఎస్‌ భారతి కాలి గోటికి కూడా టీడీపీ మహిళా నేత అనిత సరిపోదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిన  దశలో మనో నిబ్బరంతో కుటుంబాన్ని వైఎస్‌ భారతమ్మ నడిపారు. ఆమె ఓ మంచి తల్లి.. భార్య.. బిజినెస్ విమెన్‌గా మా అందరికీ ఆదర్శమని కల్యాణి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె డిస్టింక్షన్‌లో పాసైతే చంద్రబాబు అసూయతో విమర్శలు చేశారు. భారతమ్మ సూట్ కేసులు మోశారన్నారు.. మరి భువనేశ్వరీ దేవి ఎన్ని సూట్ కేసులు మోశారు’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.

‘‘ఇంట్లో ఆడవాళ్లని కూడా బయటకు లాగే నైజం చంద్రబాబు పార్టీది. జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా దోచుకున్నాయి. జగనన్న పాలనలో చేసిన అప్పులు జనం కోసం చేస్తే.. టీడీపీ హయాంలో అప్పులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. జగనన్న పాలనలో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ప్రధాని నుంచి.. అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారని’’ కల్యాణి అన్నారు.

చంద్రబాబుకి మహిళలను కలుపు మొక్కలుగా తీసి పారేయడం అలవాటు. అనితకు కూడా అదే పరిస్థితి దాపురిస్తోంది జాగ్రత్త. దివ్యవాణి కూడా అలాగే నష్టపోయింది. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్తాం. కానీ సభ్యత మరిచి విమర్శలు చేస్తే ఉపేక్షించం’’ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు