ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర: వరుదు కల్యాణి

10 Sep, 2022 13:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 29 గ్రామాల కోసమే చంద్రబాబు ఆరాటమని మండిపడ్డారు. 26 జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్‌ పాటుపడుతున్నారన్నారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారు. గ్రాఫిక్స్‌తో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివద్ధి చెందుతుందని ఆమె అన్నారు.
చదవండి: ‘ఎన్టీఆర్‌ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’

‘‘14 సంవత్సరాల సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం కుప్పంను మున్సిపాలిటీ చేయలేదు. ఉత్తరాంధ్రలో అధికంగా వలసలు కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఏపీలో తక్కువ వ్యయంతో కొత్త రాజధాని నిర్మాణానికి విశాఖ అనువైంది. శ్రీ కృష్ణ కమిషన్ కూడా విశాఖ రాజధానికి అనువైందని ఎప్పుడో చెప్పింది. సీఎంగా చంద్రబాబు విశాఖలో పెట్టుబడుల  సదస్సు పెట్టీ రాజధానిగా అనువైందనీ గతంలో అన్నారని వరుదు కల్యాణి గుర్తు చేశారు. మరి అప్పుడు అమరావతిలో పెట్టుబడులు అని నేరుగా ఎందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు.

‘ఉత్తరాంధ్ర ప్రజల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. ఆదాయం అంతా అమరావతికి ఇస్తే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి?. బిడ్డ ఆకలిగా ఏడుస్తుంటే పాల ఫ్యాక్టరీ పెడతానని చెప్పే నైజం చంద్రబాబుది. విశాఖ రాజధానిగా ప్రజలు కోరుకుంటున్నారు’’ అని  వరుదు కల్యాణి అన్నారు.

మరిన్ని వార్తలు