కేంద్రం రూల్స్‌ అంటే లెక్కలేదా?

23 Jan, 2021 15:03 IST|Sakshi

ఎంపీ బాలశౌరి

సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు, ప్రజల ప్రాణానికో న్యాయం.. మీ ప్రాణానికి మరొక న్యాయమా?. ఉద్యోగులంతా ఫ్రంట్‌లైన్ వారియర్స్ అని తెలియదా?. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. కేంద్రం రూల్స్ అంటే నిమ్మగడ్డకు లెక్కలేదా?. దీనిపై వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారంటూ’’ బాలశౌరి విమర్శలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు

కరోనా సమయంలో ఎన్నికలు వద్దని ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారని.. వారి అభ్యర్థనను నిమ్మగడ్డ పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందన్నారు. కోర్టులు కూడా వర్చువల్‌గానే పనిచేస్తున్నాయని..  నిమ్మగడ్డ కూడా ఎస్ఈసీ తరఫున వర్చువల్‌గా హాజరయ్యారని’’  ఎంపీ బాలశౌరి తెలిపారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!

మరిన్ని వార్తలు