అందుకే చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడా?

29 Oct, 2020 11:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీటర్‌ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోటానుకోట్ల రూపాయల లాభాల్లో ఉన్న హెరిటేజ్‌ సంస్థ.. ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉందని ప్రశ్నించారు. కోఆపరేటివ్‌ బెయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ‘చంద్రబాబు అధికారంలో ఉంటే కోటానుకోట్ల లాభాలు, అధికారం పొతే నష్టాలు. ఏమిటో  ఈ హెరిటేజ్‌ కిటుకు? అవినీతి డబ్బును  వైట్ మనీగా మార్చుకోడానికే   హెరిటేజ్ పెట్టాడా ? తన స్వార్థం కోసం పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే  కోఆపరేటివ్ డైయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
(చదవండి : ఓడి ఇంట్లో కూర్చొని ఇదేం వాదన బాబూ!)


ఇక బుధవారం మరో ట్వీట్‌ చేస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.‘చంద్రబాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయి.పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించాడు. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పాపాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు’అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
(చదవండి : పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు)

మరిన్ని వార్తలు