‘కరకట్ట కొంపలో కొంగ జపాలు.. దొంగ దీక్షలు’

25 Jul, 2021 19:32 IST|Sakshi

ట్విట్టర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో తెగించి కొట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘కరకట్ట కొంపలో కొంగ జపాలు, దొంగ దీక్షలకే చంద్రబాబు పరిమితం’ అంటూ ఆయన ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బ్రేక్ ఫాస్ట్‌కు ముందు గంట, లంచ్‌కు అరగంట ముందు దీక్ష చేసే పచ్చ టీమ్‌ ఏం చేస్తున్నట్లు?. రాష్ట్రం కోసం పోరాటం అదేనా’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు