‘ఆంధ్రప్రదేశ్‌ అని రాయడం కూడా రాని దద్దమ్మ లోకేష్‌’

14 Feb, 2023 15:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కనీసం ఆంధ్రప్రదేశ్‌ అని పేరు రాయడం కూడా చేతగాని వ్యక్తి లోకేష్‌ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, శివశంకర్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నారా లోకేష్‌ ఎక్కడ చదివాడు?. అతని క్లాస్‌మెట్స్ పేర్లు చెప్పమంటే‌ ఎందుకు చెప్పటం లేదు?. చంద్రబాబు.. లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఏ సబ్జెక్ట్‌పైనా 35 మార్కులు తెచ్చుకోలేరు. లోకేష్‌ భాష చూస్తుంటే సంస్కారం లేదని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ అని రాయడం కూడా రాని చేతగాని దద్దమ్మ లోకేష్‌. అంతేకాకుండా లోకేష్‌ తన చెత్త హావభావాలతో ప్రజల్లోకి వచ్చాడు. అలాంటి లోకేష్‌ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రెండు వేళ్లతో వెన్నుపోటు అని చూపించడం అందరికీ తెలుసు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 
 

మరిన్ని వార్తలు