గిర్రున తిరిగిన ఫ్యాన్‌.. బ్యాలెట్‌ బద్దలు 

17 Mar, 2021 20:15 IST|Sakshi

చాలా వార్డులు, డివిజన్లలో     ఏకపక్ష తీర్పు  

నామమాత్రపు పోటీ     ఇవ్వలేని టీడీపీ అభ్యర్థులు 

బంపర్‌ మెజారీ్టతో సత్తా     చాటిన వైఎస్సార్‌సీపీ  

మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గిర్రున తిరగ్గా బ్యాలెట్‌ బాక్సులు బద్దలయ్యాయి. సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వైఎస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి అస్త్రాలుగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ప్రచారం హోరెత్తించగా.. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. అప్పటివరకూ టీడీపీ కంచుకోటగా ఉన్న వార్డులు/ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ     మెజార్టీతో పాగా వేశారు. ఫలితంగా అనంతపురం కార్పొరేషన్‌ సహా చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ ఉనికి కోల్పోయింది. 

అనంతపురం సెంట్రల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ స్పీడుకు ప్రత్యర్థి పారీ్టలు గల్లంతయ్యాయి. ప్రజలందరూ ఏకపక్షంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి పట్టం కట్టారు. ఫలితంగా మున్సిపాలిటీల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్‌లో తొలిసారి ప్రతిపక్ష పారీ్టలకు కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కకపోవడం విశేషం. 

టీడీపీ ఖల్లాస్‌ 
అనంతపురం నగరంలో టీడీపీకి మంచి పట్టు ఉండేది. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లుండగా.. 48 స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో అత్యధిక మెజార్టీ అనంతపురం నగరపాలక సంస్థలో వచ్చాయి.  

  • 26వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థి వర్దిరెడ్డి మీనాక్షమ్మ ఏకంగా 2,455 ఓట్ల మెజార్టీతో తిరుగులేని విజయం సాధించారు. 
  • టీడీపీ హయాంలో 33 డివిజన్‌లో నుంచి గెలిచిన గంపన్న డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. టీడీపీకి బాగా పట్టున్న డివిజన్‌గా పేరుంది. అలాంటి చోట  తొలిసారి బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాకే చంద్రశేఖర్‌ ఏకంగా 2,067 ఓట్ల మెజార్టీ సాధించి జయకేతనం ఎగురవేశారు. 

పురం...వైఎస్సార్‌ సీపీ పరం 

  • హిందూపురం మున్సిపాల్టీలో 38 వార్డులుండగా.. 29 వార్డులు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 
  • 31 వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చిన్నమ్మ ఏకంగా 1,136 ఓట్లతో చిరస్మరణీయమైన విజయం దక్కించుకున్నారు. 
  • 30 వార్డులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆసీఫుల్లా 1,002 ఓట్ల మెజార్టీ సాధించారు.  
  • 21 వార్డులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మారుతీరెడ్డి.. తొలి సారిగా బరిలో నిలిచి 988 ఓట్ల మెజారీ్ట సాధించారు. 

దుర్గంపై.. ఎగిరిన వైఎస్సార్‌ సీపీ జెండా 
= రాయదుర్గంలో 32 వార్డులుండగా... 30 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.  25వ వార్డు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కె.నసీమా 700 ఓట్లు, 19వ వార్డులో శారదాదేవి 660 ఓట్లు, 30వ వార్డులో గోరంట్ల ఉష 657 ఓట్లమెజార్టీతో విజయం సాధించారు. 

మున్సిపాలిటీల్లో ఘన విజయం 
ధర్మవరం మున్సిపాలిటీ చరిత్రను సృష్టించింది. ధర్మవరంలో 40 వార్డులుండగా 40 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిపొంది క్లీన్‌స్వీప్‌ చేశారు. గుత్తిలో 25 వార్డులుండగా 24 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కదిరిలో 36 వార్డులుండగా 30 వార్డులను, మడకశిరలో 20 స్థానాలకు 15 వార్డులు, కళ్యాణదుర్గంలో 24 వార్డులకు 19 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మిగిలిని అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది.  

మరిన్ని వార్తలు