రైతుల గోస పట్టని సీఎం కేసీఆర్‌: షర్మిల 

7 Dec, 2021 09:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు యాసంగి రైతుల గోస పట్టడం లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ వైఖరిని ఎండగట్టారు. చివరిగింజ వరకు కొంటామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు