తెలంగాణలో అప్పులేని రైతు లేడు 

25 Nov, 2022 02:01 IST|Sakshi
మాట ముచ్చట  కార్యక్రమంలో షర్మిల  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  

గణపురం: తెలంగాణలో రైతులు పూర్తిగా అప్పులపాలయ్యారని, అప్పులేని రైతు లేడని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా గణ పురం మండలంలో కొనసాగింది. సాయంత్రం గణపురం మండలకేంద్రంలో ప్రజలతో ‘మాట–ముచ్చట’నిర్వహించారు. రుణమాఫీ చేయక బ్యాంకుల్లో రైతులను డీఫాల్టర్స్‌ చేశారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు.

అప్పుల బాధతో రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఓట్లు వేయించుకున్న తర్వాత వారిని పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కేసీఆర్‌కు అమ్ముడు పోయాయని, ప్రజా సమస్యలపై పోరాడటంలో కాంగ్రెస్, బీజే పీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు