సీఎం జగన్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి

8 May, 2022 21:05 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం, కార్యకర్తల కృషి వలనే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని టీటీడీ ఛైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కరణం ధర్మశ్రీ ఆదివారం వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ గెలిచిన తర్వాత మూడేళ్లు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. నవరత్నాల ద్వారా సీఎం జగన్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎల్లో మీడియా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

చదవండి: (మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్‌ సింగిల్‌గానే: దాడిశెట్టి రాజా)

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన ఐరెన్ లెగ్ ఎవరూ లేరు. చంద్రబాబు ఐరెన్ లెగ్ 1 అయితే లోకేష్ 2. చంద్రబాబు పాలనలో అంతా కరువు కటకాలే. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వైఎస్ జగన్‌ గోల్డెన్ లెగ్ అని మంత్రి అమరనాథ్‌ అన్నారు. 

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ధర్మశ్రీని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియమించడం సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో వైస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుంది. అందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాము. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్‌ రావడం మన అదృష్టం. సీఎం జగన్‌ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు వైస్సార్‌సీపీని విజయవంతం చేస్తామ'ని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

చదవండి: (పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్‌ కౌంటర్‌)

మరిన్ని వార్తలు