తప్పుడు రాతలతో రామోజీ పబ్బం: వైవీ సుబ్బారెడ్డి

2 Feb, 2024 14:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీ, చంద్రబాబులు దిట్టలంటూ వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు రాతలతో రామోజీ పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు.

మార్గదర్శి కేసు విచారణ జరిగితే శిక్ష తప్పదని రామోజీ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. విచారిస్తే బెడ్ మీద పడుకొని యాక్టింగ్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

కాగా, సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్‌ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు