పల్లెప్రగతికి ఆహ్వానం అందలేదని టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ రాజీనామా

11 Jul, 2021 09:06 IST|Sakshi

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాలు చిలప్‌చెడ్‌ మండలోని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగిన్పప్పటికీ ఏ ఒక్క రోజు, ఏ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డికి ఆధికారిక ఆహ్వానం అందలేదు. దీంతో మనస్థాపానికి గురైన శేషసాయిరెడ్డి శనివారం టీఅర్‌ఎస్‌ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను టీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఅర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేషసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జరిగిన పది రోజుల పల్లెప్రగతి కార్యక్రమాలకు మండల పర్యటనకు నాలుగు సార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వచ్చారు.

మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో హరితహారం కార్యక్రమం, రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ప్రోటోకాల్‌ ప్రకారం తనకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతోనే హాజరు కాలేదని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన చిలప్‌చెడ్‌ మండల జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిచి, మండల అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమాలకు తనను అధికారులు మరచిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు