నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

9 Nov, 2023 01:12 IST|Sakshi
జంకె వెంకటరెడ్డి

ఒంగోలు: వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఇందుకు మండలంలోని నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అండ్‌ కో నిత్యం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఈ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఏమేమి పథకాలు, ఎవరెవరికి, ఎంతమేర ఆ సచివాలయం ద్వారా ప్రజలకు అందించారు? ఆ సచివాలయ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి సంబంధించి సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు ఉంచడంతోపాటు వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. సచివాలయ పరిధిలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాలు వివరించడంతో పాటు వారికి రిపోర్టు కార్డు అందించి దాని మీద చంద్రబాబు ఇచ్చిన హామీలు, జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలలో ఏవి అమలవుతున్నాయి, వారికి ఏ పథకాలు అందాయనే దానిపై టిక్‌ వేయించి వారికి వచ్చిన స్కోర్‌ను వివరించాలన్నారు. దాంతోపాటు చివర్లో వారి ద్వారా జగన్‌ పాలనకు స్టాంపు వేయాలని కోరాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు పాలనకు, జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించాలన్నారు.

పార్టీ పతాకం ఎగురవేయడంతోపాటు ఆ సచివాలయ పరిధిలోనే నిద్ర కార్యక్రమం నిర్వహించాలి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి

మరిన్ని వార్తలు