రైతును రాజుగా చేసిన జగనన్న

2 Dec, 2023 01:24 IST|Sakshi
రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం: రైతుల కోసం అనునిత్యం తపన పడుతూ.. వారికి చిన్న కష్టమొచ్చినా అక్కున చేర్చుకొని రైతులను రారాజుగా, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కొనియాడారు. స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రాం ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ తరుణంలో వైఎస్సార్‌ 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లలో 6 విడతలుగా 30 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేద రైతులకు పంపిణీ చేశారని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి రెండు అడుగులు ముందుకేసి తన నాలుగున్నర సంవత్సరాల్లో 28 లక్షల ఎకరాలను భూ పంపిణీ చేశారని అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల ముందు జగనన్న తాను చేసిన సుదూర పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులేకుండా పోయిందని రైతులు ఆయన దృష్టికి తీసుకొని వెళ్లగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటానని చెప్పిన మాట ప్రకారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అని టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు తన పదవీ కాలంలో రైతులను పూర్తిగా విస్మరించారని, ఫలితంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికలు సమీపించే కొద్ది పచ్చనేతలకు ఎక్కడాలేని మోసపు మాటలు జ్ఞాపకం వస్తాయని, రైతులకు రుణమాఫీ చేస్తామని, భూ పంపిణీ చేస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తారని, ఆ తరువాత వారిచ్చిన వాగ్దానాలను విస్మరిస్తారని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకున్న రైతులు 2019లో టీడీపీని అడ్రస్‌ లేకుండా చేశారని చెప్పారు.

పచ్చనేతది ఓటు బ్యాంకుగా చూసే మనస్తత్వం

నారా చంద్రబాబు నాయుడుది బడుగు, బలహీన, పేదవర్గాలను ఓటు బ్యాంకుగా చూసే మనస్తత్వమని మంత్రి విమర్శించారు. సినిమా చూపే మనిషి (పవన్‌కల్యాణ్‌) ఒక పక్క చంద్రబాబుకు గ్యారంటీ అంటా.. చంద్రబాబునాయుడు మనకు ష్యూరిటీ అంటా అని మంత్రి వ్యంగ్యంగా అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 103 మందికి 138.23 ఎకరాల అసైన్‌మెంట్‌ పట్టాలు, 629 మందికి 1263.76 ఎకరాలకు ఫ్రీ హోల్డ్‌ అసైన్‌మెంట్‌ (20 ఏళ్లు అనుభవంలో ఉన్న) పట్టాలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్‌, కందుల వెంకటయ్య, కోట్ల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చేదూరి విజయభాస్కర్‌, యేర్వ చలమారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు కె.ఓబులరెడ్డి, జి.రమణారెడ్డి, ఎస్‌.పోలిరెడ్డి, జిల్లాపరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌బాష, సచివాలయాల మండల కన్వీనర్‌ సయ్యద్‌ జబీవుల్లా, కో ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ మేడగం వెంకటరెడ్డి, ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కె.జయరావు, సర్పంచ్‌లు అరుణాబాయి, సుబ్బారెడ్డి, ఏకుల ముసలారెడ్డి, తహసీల్దార్లు కె.రవీంద్రరెడ్డి, కె.దాస్‌, కృష్ణారెడ్డి, వి.కిరణ్‌, వేణుగోపాలరావు పాల్గొన్నారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ రైతులకు భూ యాజమాన్య హక్కు పత్రాలు, అసైన్‌మెంట్‌ పట్టాలు, ఫ్రీ హోల్డ్‌ అసైన్‌మెంట్‌ పట్టాల పంపిణీ

మరిన్ని వార్తలు