మొరాయించిన సర్వర్లు

2 Dec, 2023 01:24 IST|Sakshi

ఒంగోలు సబర్బన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సర్వర్లు మొరాయించటంతో స్థిరాస్థి క్రయ విక్రయదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ శాఖ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలోనే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు స్థిరాస్థి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్థిరాస్థి క్రయ విక్రయాలు పూర్తి చేసుకొని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చి వారు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కార్డ్‌ 2.0 ప్రైమ్‌ విధానాన్ని గత నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. నేరుగా ఆన్‌లైన్‌ ద్వారానే ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చే అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ట్రయల్‌ చెక్‌ కింద కొన్ని కార్డ్‌ 2.0 ప్రైమ్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. పూర్తి స్థాయిలో నూతన విధానం ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేయవచ్చని రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయించిన తరువాత మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అయితే సర్వర్లలో సాంకేతిక లోపం ఏర్పడి సర్వర్లు మొరాయించాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారానికి మొత్తం సాంకేతిక లోపాన్ని సవరించటం ద్వారా యధావిధిగా స్థిరాస్థి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఒక్కరోజులో దాదాపు 15 వేలకు పైగా స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే దాదాపు 400 నుంచి 600 వరకు డాక్యుమెంట్లు ఆగిపోయాయి. అన్ని రకాలుగా రూ.కోటి వరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయినట్లయింది.

నిలిచిన స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ...

మరిన్ని వార్తలు