ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించండి

2 Dec, 2023 01:48 IST|Sakshi
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ సేథుమాధవన్‌

మార్కాపురం రూరల్‌: మార్కాపురం డివిజన్‌లో గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుల వద్దకు వెళ్లి త్వరగా పూర్తయ్యేలా చూడాలని సబ్‌ కలెక్టర్‌ సేథుమాధవన్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక డ్వాక్రా బజారులో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 1 నుంచి జనవరి 31వ తేదీ వరకూ ప్రతిరోజూ ఇళ్లను సందర్శిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. నిర్మాణానికి అవసరమయ్యే రుణాలను ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు అందించేందుకు సహకరించాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆర్‌సీఎల్‌, బీఎల్‌, ఎల్‌ఎల్‌ గృహాలు వందశాతం పూర్తిచేయడానికి ప్రత్యేక కార్యాచరణ, రోడ్డు మ్యాప్‌ సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ పవన్‌కుమార్‌, డీఎల్‌డీఓ సాయికుమార్‌, ఎంపీడీసీ చందన, తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ సేథుమాధవన్‌

మరిన్ని వార్తలు