మాది అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వం

2 Dec, 2023 01:48 IST|Sakshi
మహిళకు ప్రభుత్వ పథకాల బుక్‌లెట్‌ అందిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

త్రిపురాంతకం: తమది అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వమని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నారని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలను రాజకీయాలకు అతీతంగా అందిస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన సంక్షేమ పథకాలతో మధ్యవర్తి ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమచేసినట్లు చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్న ఏకై క ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమని అన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తూ తెలంగాణలో ఒకరు కాంగ్రెస్‌తో, మరొకరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. వీరికి సంక్షేమం, అభివృద్ధి కనిపించదని అన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను మంత్రి సురేష్‌ వివరించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి.కిరణ్‌, ఎంపీడీఓ సాంబశివరావు, ఏఓ కె.నీరజ, ఏఈ వెంకటేశ్వరరావు, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌వీ పిచ్చయ్య యాదవ్‌, గ్రామసర్పంచ్‌ వెంకట తిరుమలయ్య, ఎంపీటీసీ ఏసేబు, పార్టీ కన్వీనర్‌ ఎస్‌.పోలిరెడ్డి, గ్రామ సచివాలయ కన్వీనర్‌ యల్లారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్‌ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు రాజయ్య, గురవయ్య, ఎస్‌.రంగబాబు, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా నడిపిస్తున్న

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

గొల్లపల్లిలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌, గడప

గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

మరిన్ని వార్తలు