సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

2 Dec, 2023 01:48 IST|Sakshi
శిక్షణలో వివరిస్తున్న ఆత్మ పీడి అన్నపూర్ణ

ఒంగోలు సెంట్రల్‌: యువత సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ అన్నపూర్ణ అన్నారు. ఆత్మ కార్యాలయం ఆవరణలో శుక్రవారం స్కిల్‌ ట్రైనింగ్‌ రూరల్‌ యూత్‌ (ఎస్టీఆర్‌ వై) కార్యక్రమం నాల్గవ రోజు నిర్వహించారు. ఆత్మ పీడీ అన్నపూర్ణ మాట్లాడుతూ వ్యవసాయ పంటల్లో, ఉద్యాన వన పంటల్లో, పశు పోషణలో సైతం సేంద్రియ ఎరువులు వాడిన వాటి పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. జీవన ఎరువులు వాడిన వాటికి, రసాయన ఎరువుల వాడిన వాటికి భేదాలను వివరించారు. పశుసంవర్థక శాఖ డీడీఏ సోమయ్య, దర్శి హెచ్‌ఆర్‌ఎస్‌ హెడ్‌ ధనుంజయ రావు, జీవ శాఖ ఏఓ గోపిచంద్‌, ఎన్‌ఎస్‌ఎఫ్‌ మహేష్‌, డీఆర్‌సీ ఏఓలు శైలజరాణి, శేషమ్మ పలు విభాగాల్లో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత, పనిచేసే విధానాలను వివరించారు.

మరిన్ని వార్తలు