జగనన్న ఆదుకున్నారు

3 Dec, 2023 01:08 IST|Sakshi

జగనన్న ఆదుకున్నారు

మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అనుకోకుండా మా ఆయన పొలం పనుల కోసం అప్పులు చేశాడు. కానీ అవి తీర్చలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో జగనన్న ప్రభుత్వం రైతు ఆత్మహత్య పరిహారం కింద రూ.7 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బులతో కొన్ని అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో మా అబ్బాయిని చదివించుకుంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాను. మా అబ్బాయికి అమ్మఒడి కూడా వస్తోంది. జగనన్న విద్యాకానుకను ఇచ్చారు. నాకు పింఛన్‌ రూ.3000 వస్తుంది. ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నాం.

– జి.సీతారాములమ్మ, ఉమ్మడివరం, పుల్లలచెరువు మండలం

మరిన్ని వార్తలు