మా సొంతింటి కల నెరవేరింది

3 Dec, 2023 01:08 IST|Sakshi

మా సొంతింటి కల నెరవేరింది

సొంతిల్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మా కల నేటికి నెరవేరింది. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. కానీ పట్టా ఇవ్వలేదు. ఇంటి స్థలం చూపించలేదు. భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉండే వాళ్లం. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట స్థలం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. చేసుకున్న మొదటి దఫానే ఇంటి స్థలం మంజూరు చేసి హౌసింగ్‌లో ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్‌ వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు అదనంగా మరికొంత నగదుతో మాకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో ఉంటున్నాం.

– బచ్చలకూరి దేవదానం, చిన్నకంభం, కంభం మండలం

మరిన్ని వార్తలు