ఈ ప్రభుత్వం ఎంతో ఆదుకుంది

3 Dec, 2023 01:08 IST|Sakshi

ఈ ప్రభుత్వం ఎంతో ఆదుకుంది

నాకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ఈ ప్రభుత్వం డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తోంది. గతంలో పింఛన్‌ వచ్చినా ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1వ తేదీనే గ్రామ వలంటీర్‌ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళ్తుండడంతో చాలా శ్రమ తప్పింది. వారంలో మూడు సార్లు మా ఇంటి వద్దకే 108 వచ్చి డయాలసిస్‌ చేసి వెళ్తారు. పింఛన్‌ డబ్బు నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

– కందురు మధుసూదన్‌రెడ్డి, ఉమ్మడివరం, పుల్లలచెరువు మండలం

మరిన్ని వార్తలు