నవరత్నాలతో ప్రతి ఇంటా సంక్షేమం

4 Dec, 2023 00:56 IST|Sakshi
సంక్షేమ పథకాల లబ్ధి బుక్‌లెట్‌ను అందచేస్తున్న ఎమ్మెల్యే బుర్రా

ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

కనిగిరి రూరల్‌: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌న్‌రెడ్డి పాలన సాగుతోందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. పట్టణంలోని 4వ సచివాలయంలో పరిధిలోని మాచవరంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందచేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రమాణికంగా జల్లెడ పట్టిమరీ సంక్షేమ పథకాలను అందచేసినట్లు చెప్పారు. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారన్నారు. టీడీపీ హయాంలో పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు వచ్చేవని గుర్తు చేశారు. కానీ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు 600 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌లు మాయ మాటలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు. టీడీపీ పాలనలో దోచుకో.. దాచుకో.. పంచుకో ..తప్పా అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు. సంక్షేమ లబ్ధిదారులంతా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బుర్రా ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుని, తక్షణ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి బుక్‌లెట్‌ను అందచేశారు. తొలుత కౌన్సిలర్‌ రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీ నర్సారెడ్డి, బొజ్జా బ్రహ్మయ్య, సూరసాని వెంకటరెడ్డి, జెన్నుపాటి ఇమ్మానియేలు, ప్రభాకర్‌, ఉప్పు ప్రసాద్‌, బాలాజీ స్థానిక నాయకులు ఎమ్మెల్యే బుర్రాకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, వైఎస్‌ చైర్మన్లు పులి శాంతి గోవర్ధన్‌, ఆర్‌ మాణిక్యరావు, పోతిరెడ్డి రాజారెడ్డి, సొసైటీ చైర్మన్‌ సంగు సుబ్బారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగనాయకులరెడ్డి, బసిరెడ్డి పిచ్చిరెడ్డి, జిలానీ, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్వీ గోవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, జేసీఎస్‌ పట్టణ కన్వీనర్‌ వేల్పుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు శ్రీ రాం సతీష్‌, దేవరాజ్‌, నక్కా రామకృష్ణా, రామనబోయిన శ్రీను, అబ్రహం లింకన్‌, ఎస్‌కే ఖాజా మొహిద్దీన్‌, దాసరి మురళీ, నాగూర్‌బీ, భారతీ, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు పాల్గొన్నారు. తొలుత వార్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ పి.రాజశేఖర్‌రెడ్డి, చైర్మన్‌ గఫార్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు