ఫెన్సింగ్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

4 Dec, 2023 00:56 IST|Sakshi
ఫెన్సింగ్‌ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

ఒంగోలు: ఫెన్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అండర్‌ 14, అండర్‌ 17 క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో జరిగింది. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 8 నుంచి 10 వరకు విజయనగరంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జి.నవీన్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పలువురు అభినందించారు.

అండర్‌ 14 విభాగం : ఎస్‌కే ఆదిల్‌, వై.కుషాల్‌, జె.శ్రీసాయిచరణ్‌, బి.ఈశ్వర్‌, వి.జ్యోతిక, ఎస్‌.రిత్విక, ఎస్‌.హర్షిణి(ఫాయల్‌ విభాగం), వి.లేఖన, కె.జగదీష్‌ చౌదరి, ఎస్‌.భార్గవ్‌ శివకార్తికేయ, వై.కుష్వంత్‌, సీహెచ్‌ జ్ఞానేశ్వర్‌(ఈపీ విభాగం), జె.జగదీశ్వర్‌(సాబర్‌ విభాగం) అండర్‌ 17 విభాగం : ఎస్‌కే ఆదిల్‌, వై.భూమి, నర్తన, జి.చైత్ర(ఫాయల్‌), కె.జగదీష్‌, ఎండీ అబ్దుల్‌, పి.అంబరీష్‌, వై.విశ్వనాథ్‌, ఎస్‌కే ఆసిఫా(ఈపీ విభాగం)

మరిన్ని వార్తలు