సీపీఆర్‌తో ప్రాణాలకు రక్షణ

4 Dec, 2023 00:56 IST|Sakshi
మీడియా ప్రతినిధులకు సీపీఆర్‌లో శిక్షణ

ఒంగోలు టౌన్‌: గుండెపోటు సమయంలో సీపీఆర్‌ చేయడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ప్రకాష్‌బాబు అన్నారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇంటింటికీ సీపీఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్‌ భవన్‌లో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండెపోటు వచ్చిన సమయంలో తక్షణం స్పందించి సీపీఆర్‌ చేయడం వల్ల ఆగిపోయిన గుండె తిరిగి పనిచేస్తుందన్నారు. అలా చేయడం వల్ల వైద్య సేవలు లభించేంత వరకు గుండెపోటు వచ్చిన వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ డా.వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారి రాఘవ, మహిళా విభాగం కన్వీనర్‌ కోటేశ్వరమ్మ, కో కన్వీనర్‌ డాక్టర్‌ షేక్‌ మజ్నూ, కార్యదర్శి సుజాత, కోశాధికారి శ్రీదేవి, ఫస్ట్‌ ఎయిడ్‌ శిక్షకులు డా.కృష్ణారావు, జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు