ఆటో తిరగబడి నలుగురికి గాయాలు

4 Dec, 2023 00:56 IST|Sakshi

మద్దిపాడు: అటో తిరగబడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం ఉదయం గుండ్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని లింగంగుంట గ్రామానికి చెందిన కలివాయి వెంకటేశ్వర్లు నాగేంద్రం దంపతులు తమ కుమారుడు రాజేష్‌, బంధువులతో కలిసి అద్దంకి మండం సింగరకొండ ఆంజనేయస్వామి ఆలయానికి ఆటోలో వెళుతున్నారు. ఈ క్రమంలో డ్రైవర్‌ రమేష్‌ నిద్రమత్తులో ఆటోను వేగంగా నడుపుతూ అదుపు తప్పి భారత్‌ పెట్రోలు బంకు ఎదురుగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తుల్లో సింగరాయకొండకు చెందిన పత్తిపాటి సుబ్బారాయుడు, ఆయన భార్య సుగుణ, మల్లవల్లి శేషమ్మ ఉన్నారు. ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

180 మంది గైర్హాజరు

ఒంగోలు: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ప్రవేశపరీక్షకు 180 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆదివారం 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు 3826 మందికి గాను 3646 మంది హాజరయ్యారు. స్క్వాడ్‌ బృందాలు 14 పరీక్షా కేంద్రాలను తనిఖీచేయగా, డీఈఓ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు డీఈఓ వీఎస్‌ సుబ్బారావు తెలిపారు.

మరిన్ని వార్తలు