‘బంగార్రాజు’ మూవీ షూటింగ్‌ స్టార్‌ చేసిన అక్కినేని హీరోలు

25 Aug, 2021 21:09 IST|Sakshi

హీరో నాగార్జున అక్కినేని, నాగ‌చైత‌న్యలు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. క‌ల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన హిట్‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ మ‌ల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ సెట్స్పైకి వచ్చింది. హైద‌రాబాద్‌లో బంగార్రాజు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభ‌మైంద‌ంటూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో రెండు వైపులా రెండు బుల్లెట్ బైక్స్ క‌నిపిస్తుండ‌గా.. బ్యాక్ డ్రాప్‌లో ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఈ సారి బంగార్రాజు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం పంచ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసిన తాజాగా స్టిల్‌తో అర్థ‌మ‌వుతుంది.

చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్‌ హీరో తెలుసా!

మొదటి పార్టులో నాగార్జున‌కు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ, బంగార్రాజులో కూడా జోడి కట్టింది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి నాగచైత‌న్య‌కు జోడీగా న‌టిస్తోంది. నాగార్జున మ‌రోవైపు ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు బ్ర‌హ్మాస్త్ర‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. నాగచైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీ సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దీంతోపాటు అమీర్‌ఖాన్‌ లాల్ సింగ్ చ‌ద్దాలో చై కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు