టీసీఎస్‌‌ ఉద్యోగులకు తీపి కబురు

20 Mar, 2021 01:24 IST|Sakshi

టీసీఎస్‌ ఉద్యోగులకు జీతాల పెంపు

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌).. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021-22) ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఆఫ్‌షోర్‌ సిబ్బందికి 6-7 శాతం మేర పెంపు ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించాయి. సుమారు 4.7 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. వేతనాల పెంపు ప్రతిపాదనలను టీసీఎస్‌ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ఆరు నెలల వ్యవధిలో టీసీఎస్‌ వేతనాలను పెంచడం ఇది రెండోసారి కానుంది. తాజాగా పెంచబోయేది కూడా కలిపితే ఆరు నెలల కాలంలో 12–14 శాతం మేర వేతనాలను పెంచినట్లవుతుంది.    (టీవర్క్‌ ఫ్రం హోమ్ నుంచి క్రమంగా హైబ్రిడ్‌ పని విధానం వైపు)

మరిన్ని వార్తలు