బీడీ కార్మికుల సమస్యలపై పోరాడుతాం

3 Mar, 2023 01:02 IST|Sakshi
మాట్లాడుతున్న రాములు
● ఐఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాములు

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): బీడీ కార్మికుల సమస్యలు, హక్కులపై పోరాడుతామని ఐఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాములు అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఐఎస్టీయూ, బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లాస్థాయి ప్రథమ మహాసభలను నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా ఆకుల రాములు, ఉపాధ్యక్షుడిగా పర్శరాములు, ప్రధాన కార్యదర్శిగా వేముల పర్శరాములు, సహాయ కార్యదర్శిగా తుడుం శ్రీకాంత్‌, కోశాధికారిగా ఎడవెల్లి దేవయ్య, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలిగా మందాటి మణెవ్వ, ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వేముల పర్శరాములు, సహాయ కార్యదర్శిగా వాసవి రాజవ్వ, కోశాధికారిగా ముగ్గు లక్ష్మితో పాటు ముగ్గురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు భామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు చింత భూమేశ్వర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు