సమస్యలపై ఫిర్యాదు చేయండి

25 Feb, 2023 11:30 IST|Sakshi

మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత రాష్ట్రాల ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి

షాద్‌నగర్‌: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌, దక్షిణ భారత రాష్ట్రాల ఉపాధ్యక్షుడు వర్ధిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ టౌన్‌షిప్‌ కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వెంచర్‌లో డ్రైనేజీ పనులు చేపట్టారని, అదేవిధంగా పార్కులను అభివృద్ధి చేయలేదని వివరించారు. మురుగు నీటిని రీసైక్లింగ్‌ చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామని వెంచర్‌ నిర్వాహకులు హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఫిర్యాదు చేశారు. నాసిరకం పైపులతో డ్రైనేజీ నిర్మించి పైప్‌లైన్‌పై మొక్కలు నాటారన్నారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా మారడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోతున్నాయని, దీంతో కాలనీలోకి మురు గు నీరు చేరుతోందని తెలిపారు. కాలనీలో తరచూ విద్యుత్‌ సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పా రు. అనంతరం పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ వాసులు సమస్యలతో కూడిన పత్రాలపై సంతకాలు చేసి మానవ హక్కుల కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో ఫిర్యా దు చేయాలని సూచించారు. కమిషనర్‌ జాయింట్‌ సెక్రటరీ విజయేందర్‌రెడ్డి, రాంరెడ్డి, దా మోదర్‌రెడ్డి, మాధవరెడ్డి, అమర్నాథ్‌, రాజిరెడ్డి, ప్రభాకర్‌చారి, రాఘవేందర్‌రెడ్డి, ప్రభాకర్‌చారి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, జగన్‌, ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు