కదలికలపై పక్కానిఘా

9 Nov, 2023 05:58 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి
సమన్వయంతో పని చేయాలి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అభ్యర్థుల కదలికలపై ఎన్ని కల సంఘం గట్టి నిఘా పెట్టింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులే కాదు, వారి బంధువులు, ముఖ్య నాయకుల కదలికలపై సైతం దృష్టి సారించింది. ఎన్నికల వ్యయ పరిశీలకులే కాదు పోలీసు, ఎకై ్సజ్‌, ఐటీ, ఇతర కేంద్ర నిఘా సంస్థలు అభ్యర్థుల చుట్టే మోహరించాయి. ఏ రోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారు? అనేదానిపైనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్‌ పెట్టాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గానికి ఒక వ్యయ పరిశీలకుడిని నియమించింది. వీరంతా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు, ఐటీ, ఎకై ్సజ్‌ విభాగాల అధికారులతో సమావేశమై శాంతిభద్రతల అంశాన్ని చర్చించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన తనిఖీ బృందాలు.. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, సీజ్‌ చేసిన నగదు, మద్యం, ఇతర వస్తువులపై వారు ఆరా తీస్తున్నారు. నిఘా సంస్థలు వెంటాడుతుండ టంతో అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు రూ.28.56 కోట్లు సీజ్‌

పోలీసు తనిఖీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేని రూ.28.56 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 59.22 కిలోల బంగారం, 58.81 కిలోల వెండి, 260 సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. రూ.47.81 లక్షల విలువ చేసే చీరలు, వంటపా త్రలు, ఇతర వస్తువులను సీజ్‌ చేయడం విశేషం. జిల్లా వ్యాప్తంగా రూ.50 వేలకు మించి నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను వెంట తీసు కెళ్తూ పోలీసులకు 451 మంది పట్టుబడగా, వీరిలో 344 మంది గ్రీవెన్స్‌ కమిటీకి దరఖాస్తు చేసుకున్నా రు. వీరిలో 129 మంది అభ్యర్థనలను, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, వారికి రూ.3.96 కోట్ల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను తిరిగిచ్చేశారు. రూ.10 లక్షలకుపైగా వెంట తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన మరో 28 కేసులను (రూ.7,05,74,517) ఐటీశాఖకు అప్పగించారు.

అభ్యర్థులు, వారి బంధువులు, ముఖ్య నాయకులే టార్గెట్‌

తనిఖీలు ముమ్మరం చేసిన

పోలీసు, ఎకై ్సజ్‌, ఐటీ శాఖలు

ఇప్పటి వరకు 451 కేసులు.. రూ.28.56 కోట్ల నగదు స్వాధీనం

59.22 కిలోల బంగారం, 58.81 కేజీల సిల్వర్‌ సీజ్‌

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి జిల్లాలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ బృందాలతో పాటు, ఇతర బృందాలు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న బృందాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్లు పూర్తయిన తర్వాత ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని బృందాలన్నీ చురుగ్గా ఉండటమే కాకుండా, పనిని ఇంకా వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, అక్రమంగా తరలించే డబ్బు, మద్యం వంటివా టిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాలు, మద్యం, డబ్బు వంటి అంశాలన్నింటినీ సమీక్షించడం జరుగుతుందన్నారు. జీపీఎస్‌ ట్రాక్‌ సిస్టం ద్వారా ఆయా బృందాల పనితీరును పరిశీలించనున్నట్లు వెల్లడించారు. సీజర్‌ టీం ఇంకా త్వరగా రెస్పాండ్‌ కావాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ చైర్మన్‌/జెడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్‌, ఎంసీసీ నోడల్‌ అధికారి సౌమ్య, డీసీఓ ధాత్రిదేవి, పోలీస్‌ టీం, ఎకై ్సజ్‌ టీం, ఇన్‌కం టాక్స్‌ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు