ఎన్నికల ‘దీపావళి’

9 Nov, 2023 07:14 IST|Sakshi

భాగ్యనగరిలో ఈసారి దీపావళి స్పెషల్‌గా ఉండనుంది. ఎన్నికల నేపథ్యంలో విభిన్నమైన సందడి కన్పిస్తోంది. దీపావళి స్పెషల్‌ వివిధ రకాల స్వీట్లు, బాణసంచాకు ఈ ఏడాది భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల జరగునున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల నేతలు పండగ వేళ ఓటర్లకు బహుమతులు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కాలనీలు, ఉద్యోగ సంఘాల వారికి మిఠాయిలు, టపాసులు బాక్సుల రూపంలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మిఠాయిల షాపులకు భారీగా ఆర్డర్లు ఇచ్చారట. దీంతో దీపావళికి మిఠాయి దుకాణాలకు ఈఏడాది రెట్టింపు గిరాకీ ఉండనుంది. మొత్తమ్మీద దీపావళి సందడిని రాజకీయ పార్టీలు ఓటర్ల మన్ననలు పొందడానికి ఉపయోగించుకుంటున్నారు. స్వీట్లు, బాణసంచా, డ్రైఫ్రూట్స్‌ ధరలకు రెక్కలు వచ్చాయి.

– సాక్షి, సిటీబ్యూరో

మరిన్ని వార్తలు