కాంగ్రెస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు

9 Nov, 2023 07:14 IST|Sakshi
భీంభరత్‌కు మద్దతు ప్రకటిస్తున్న సీపీఐ నాయకులు

మొయినాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. బుధవారం ఆయన భీంభరత్‌ నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు ఖరారు కావడంతో చేవెళ్లలో భీంభరత్‌ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా సీపీఐ శ్రేణులు పనిచేస్తాయన్నారు. ఈ నెల 10న భీంభరత్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్‌ రామస్వామి, కో కన్వీనర్‌, ప్రభులింగం, గోపాల్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల పార్టీ కార్యదర్శులు సత్తిరెడ్డి, శ్రీనివాస్‌, జంగయ్య, నాయకులు మక్బుల్‌, మల్లేశ్‌, రఘు, నారాయణ, మధు, రుక్కయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య

మరిన్ని వార్తలు