చైనా డొల్లతనం..దాచేస్తే దాగని సత్యం!

22 Sep, 2022 16:41 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో మీడియా అన్నది ఉండదు. ఉన్న ఒక్క మీడియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకే చైనా ఆర్ధిక వ్యవస్థలోని డొల్లతనం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశాలు తక్కువ. కానీ ఎంతకాలమని ఇలా దాచగలరు. నిప్పు కణికలను గుప్పెట్లో దాచి పెడితే కొంత సేపటికి చెయ్యి కాలిపోతుంది. చైనా ప్రభుత్వం కూడా అటువంటి ప్రమాదం ముంగిట నిలబడిందని మేధావులు అంటున్నారు.  పైకి చాలా బలంగా ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉన్నట్లు కనిపిస్తోంది చైనా. కానీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో  చైనా  సతమతమవుతోంది. 

ఇదీ చదవండి:  చైనా సర్కార్‌కు సవాల్‌ విసురుతున్న దెయ్యాల నగరాలు

కరోనా  కారణంగా చైనా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. చైనా నుండి రక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు ఆర్ధిక సంక్షోభం కారణంగా  చైనాతో లావాదేవీలు నిలిపివేయడంతో చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అది చైనా విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావాన్ని చూపింది. ఇది చాలదన్నట్లు  రెండేళ్లుగా చైనా లో అకాల వర్షాలు.. భారీ వరదలతో వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. అది ఆహార సంక్షోభానికి కారణమయ్యింది. కానీ లోపల మాత్రం అగ్ని పర్వతాల్లాంటి సంక్షోభాలు రగులుతున్నాయంటున్నారు నిపుణులు. 

ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?

చైనాలో ఏం జరిగినా ప్రపంచానికి తెలీకుండా అక్కడి ప్రభుత్వం దాచిపెడుతూ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే చైనాలో విదేశీ మీడియాను కూడా ఉండనివ్వరని పత్రికలపై ఎక్కడా లేని ఆంక్షలు ఉంటాయని వారంటున్నారు. అయితే తమ మీడియా ద్వారా అంతా అద్భుతంగా ఉందని చైనా ప్రచారం చేసుకుంటోందని వారంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కోలుకునే పరిస్థితి లేకపోతే మాత్రం చైనా పరిస్థితి చెప్పనలవి కానంత దుర్భరంగా మారిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, చైనా 2009 నుండి గ్లోబల్ మీడియా పెట్టుబడులపై 6.6 బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేసింది.

ఇదీ చదవండి: China: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా

మరిన్ని వార్తలు