పురుషాధిక్య సమాజంలో ఇంటి నుంచే పోరు.. పెళ్లికి దూరం ఎందుకంటే.. ‘భారత వాతావరణ సూచన తల్లి’కి గూగుల్‌ డూడుల్‌ గౌరవం

23 Aug, 2022 09:00 IST|Sakshi

ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!.

అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్‌మేడ్‌లో సిరియన్‌-క్రిస్టియన్‌ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్‌లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం.


అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్‌ డూడుల్‌ రిలీజ్‌ చేసింది గూగుల్‌. 


తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్‌ ఇయర్‌ రింగ్స్‌ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు..  Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. 

► పబ్లిక్‌ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. 

► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. 

► చెన్నైలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారామె. 

► ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ బెంగళూరులో‌.. రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ గెల్చుకుంది. 

► లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలలో ఫిజిక్స్‌ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. 

► పీహెచ్‌డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి.

► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్‌ దగ్గర ఐఐఎస్‌లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. 

► 1948లో భారత్‌ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది.

► వాయు వేగం, సోలార్‌ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. 

► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. 

► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా ఆమె విధులు నిర్వహించారు. 

► 1987లో ఐఎన్‌ఎస్‌ఏ కేఆర్‌ రామనాథన్‌ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. 

► గుండె సంబంధిత సమస్యలతో..  2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. 

► సోలార్‌ రేడియేషన్‌, ఓజోన్‌, విండ్‌ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు.

► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. 

► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది.

మరిన్ని వార్తలు