గుజరాత్‌లో టెంపుల్‌ రన్..మోదీ.. టాప్‌ రన్నర్!

1 Dec, 2022 20:47 IST|Sakshi

ఓటర్ల కంటే ముందు దేవుడికి పూజలు
గుజరాత్లో పార్టీ అధికారంలోకి రావాలన్నా అసలు దేవుడి కరుణా కటాక్షాలూ ఉండాలి. అదేంటీ ఓట్లేసేది ప్రజలు కదా అనుకుంటున్నారా? ప్రజలతో పాటు దేవుడు కూడా ఆశీస్సులు అందించాలి. అందుకే  ఎన్నికల వేళ ఆలయాల సందర్శన పెరిగిపోయింది.

మోదీ.. టాప్రన్నర్
రేసులో ముందంజలో ఉన్నారు ప్రధాని నరేంద్రమోదీ. గుజరాత్ వీడి ఎనిమిదేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ  గుజరాత్ లో నరేంద్ర మోదీయే  స్టార్ క్యాంపెయినర్. గుజరాత్ రోజు దేశానికి ఆదర్శంగా నిలిచిందంటే అది మనం తయారు చేసుకున్నదే.. యావద్దేశాన్నీ ఇపుడు గుజరాత్ లా మార్చేద్దాం అన్న నినాదంతో నరేంద్ర మోదీ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

గుళ్లూ గోపురాలు చుట్టుముట్టేస్తూ మనం తయారు చేసుకున్న గుజరాత్ ను మనమే కాపాడుకోవాలని నినదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా దూసుకుపోతున్నారు. ప్రజలకు దండం పెడుతూనే మరో వైపు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ దేవుళ్లకీ దండాలు పెట్టేస్తున్నారు ప్రధాని మోదీ. మొన్నటికి మొన్ననే సోమనాథ్ దేవాలయంలో మడికట్టేసుకుని చాలా ఓపిగ్గా పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండున్నరేళ్లపాటు వ్యవహరించిన నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా  ప్రధాని పీఠం అధిరోహించడానికి ఢిల్లీ వచ్చేశారు. అందుకే సోమనాథ్ఆలయమంటే మోదీకి చాలా ఇష్టం.

ప్రతిపక్షాలది అదే దారి
బీజేపీ ఆధ్యాత్మికతను ఎన్నికల ప్రచారంతో మిక్స్ చేస్తుంది కాబట్టి తాను కూడా అదే చేయాలని కేజ్రీవాల్ ఫిక్స్ అయిపోయారు. అందుకే మధ్య  కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు చిత్రీకరించి చెలామణీలోకి తీసుకురావాలని విచిత్ర డిమాండ్ చేశారు కేజ్రీవాల్.

దీనర్ధం ఏంటంటే దేవుళ్లు బీజేపీకే కాదు మాకూ చుట్టాలేనని కేజ్రీవాల్ చెప్పదలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్తరపున పాదయాత్ర చేస్తోన్న రాహుల్గాంధీ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న రాహుల్అక్కడే పూజలు చేసి గుజరాత్ఓటర్లకు సంకేతాలిస్తున్నారు.
పొలిటికల్ ఎడిటర్‌, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు