జనాభాలో కొన్ని దేశాలను సైతం అధిగమించిన మన రాష్ట్రాలు 

23 Jan, 2023 12:22 IST|Sakshi

-ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి 
జనాభా విషయంలో భారత్‌ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా 142 కోట్లకు పైగా జనాభాతో చైనాను అధిగమించి తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చాలా దేశాలు జనాభా విషయంలో మన రాష్ట్రాలతో సరితూగలేవు. రెండు మూడు దేశాల్లో ఉన్న జనాభా కంటే మన రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌  కాగా అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం.

2022 గణాంకాల ప్రకారం చైనా, అమెరికా, ఇండోనేషియా తరువాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 23.7 కోట్ల జనాభా నివసిస్తున్నారు. చైనాలో కూడా యూపీతో  సమానంగా జనాభా ఉన్న రాష్ట్రాలు లేకపోవడం గమనార్హం. చైనాలో జనాభా పరంగా 12.6 కోట్లతో గువన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ ప్రావిన్స్‌ జనాభా ప్రపంచ దేశాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉంటుంది. 

►ఆంధ్రప్రదేశ్‌ జనాభా ప్రపంచంలో 27వ స్థానంలో ఉన్న మయన్మార్‌తో దాదాపు సమానం.  
►దక్షిణ కొరియా (ప్రపంచంలో 28వస్థానం) కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది నివసిస్తున్నారు.  
► భారత్‌లో అత్యల్ప జనాభా ఉన్న సిక్కిం కంటే మూడు దేశాల్లో (మకావ్, బహమాస్, కేమన్‌ ఐలాండ్స్‌) జనాభా తక్కువ.   

► మహారాష్ట్ర జనాభా జపాన్‌తో సమానం.  
► బెంగాల్‌ జనాభా ఈజిప్టుతో, తమిళనాడు జనసంఖ్య జర్మనీతో సమానం.  
► ఉత్తరప్రదేశ్‌ జనాభా బ్రెజిల్‌ + ఈక్వెడార్‌ కంటే ఎక్కువ.  
►యూపీ జనాభా మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో సమానం.

మరిన్ని వార్తలు