అతడు కాస్తా.. 'ఆమె'గా

24 Nov, 2020 19:16 IST|Sakshi

 పోలీస్‌ సహాయం.. క్లినిక్‌తో కొత్త జీవితం

మధురై (తమిళనాడు): సమాజంలో హిజ్రాల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని సార్లు మానవత్వం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. ఎంత గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నా  ట్రాన్స్​జెండర్స్​ బతుకులు బాగుపడటంలేదు. సరిగ్గా ఇక్కడ కూడా అలానే జరిగింది. పురఘడిగా ఉన్నంత వరకు సాఫీగా ఉన్న జీవితం లింగమార్పిడి చేసుకున్న తరువాత ఆమె జీవితం  తలకిందులైంది.  ఓ వ్యక్తి​ మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్ని రోజుల తరువాత మహిళగా మారాలని అనుకున్నాడు. కానీ అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇటు సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు.

లింగమార్పిడి తరువాత అతడు కాస్త... ఆమెగా మారింది. అసలు కష్టం ఇక్కడే మొదలైంది. పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వెలితే సరైన ఆదరణ దక్కలేదు. ఉద్యోగంలేక ఆదుకునేవారులే​క ఇతర  ట్రాన్స్​జెండర్స్​తో కలిసి యాచక యాచకవృత్తిని ఎంచుకుంది. అదే ప్రాంతంలో ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న కవిత అనే పోలీసు అధికారి ఆమె కష్టాలను ఉన్నతాధి​కారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యంత్రాంగం ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిజంగానే ఆమె డాక్టర్‌ అని తెలియడంతో క్లినిక్​ ఏర్పాటు చేయడానికి ఆమెకు సాయం చేశారు. ఇన్​స్పెక్టర్ కవితకు అటు అధికారులు, ఇటు నెటిజన్‌లు   ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (చదవండి : మొదటి ట్రాన్స్‌ ఉమన్‌ డాక్టర్‌గా త్రినేత్ర)

Read latest Sakshi-special News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు