కొత్త భవనంలో యూఎస్‌ కాన్సులేట్‌

8 Mar, 2023 03:07 IST|Sakshi

ఈ నెల 20 నుంచి నానక్‌రాంగూడలో కార్యకలాపాలు

15 నుంచి బేగంపేట కాన్సులేట్‌  భవనంలో కార్యకలాపాలు నిలిపివేత 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా.. నూతన కాన్సులేట్‌ భవనాన్ని మార్చి 20న హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ప్రారంభిస్తోంది. రూ. 27.87 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం నుంచే ఇక నుంచి యూఎస్‌ కాన్సులేట్‌ కార్యకలాపాలు సాగనున్నాయి. నూతన కాన్సులేట్‌లో అందించే వివిధ సేవల వివరాలను యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హైదరాబాద్‌ విభాగం ప్రకటించింది. 

ప్రస్తుతం యూఎస్‌ కాన్సులేట్‌ కొనసాగుతున్న బేగంపేట ‘పైగా ప్యాలెస్‌’లో ఈనెల 15 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల నుండి 20వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కాన్సులేట్‌ మూసివేసి ఉంటుంది. ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది.

 మార్చి 20 ఉదయం 8:30 వరకు అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు +91 040–4033 8300 నంబర్‌ పైన సంప్రదించాలని కాన్సులేట్‌ జనరల్‌ వివరించింది. మార్చి 20 ఉదయం 08:30 తరవాత అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు +91 040 6932 8000 పై సంప్రదించవలసి ఉంటుంది. అత్యవసరంకాని సందేహాల కోసం, అమెరికా పౌరులు  HydACS@ state.gov కి ఈ–మెయిల్‌ చేయవలసి ఉంటుంది.

బయోమెట్రిక్‌ అపాయింట్‌మెంట్‌లు, ‘‘డ్రాప్‌బాక్స్‌’’అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్‌ పికప్‌ సహా ఇతర వీసా సేవలు – లోయర్‌ కాంకోర్స్, హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్‌ 500081లో ఉన్న వీసా అప్లికేషన్‌ సెంటర్‌ (Vఅఇ) లో కొనసాగుతాయని తెలిపింది. కాన్సులేట్‌ మా­ర్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్‌ సెంటర్‌ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. వీసా సేవలకి సంబంధించి సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్‌ చేయాలని యూఎస్‌ కాన్సులేట్‌ పేర్కొంది. కొత్త ఆఫీస్‌ చిరునామా సర్వే నం. 115/1, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032.  

మరిన్ని వార్తలు