అక్రమ దందాపై నిఘా

14 Nov, 2023 04:22 IST|Sakshi

ఎస్పీ రూపేశ్‌

జహీరాబాద్‌ టౌన్‌: జిల్లాలో అక్రమ దందాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎీస్పీ రూపేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుట్కా, మద్యం, డ్రగ్స్‌, బంగారం తదితరాల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లాలో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆ మేరకు ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి విషయాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు వెంటనే తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో 13 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. దొంగల్లో మైనర్‌ కూడా ఉన్నాడని చెప్పారు. అతడిని బాలాసాదానికి పంపామన్నారు. పేకాట స్థావరాలపై రెండు, మూడు రోజులపాటు ప్రత్యేక నిఘా ఉంచి జూదరులను అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్‌పీ రఘు, సీఐ, రాజు,ఎస్‌ఐ, శ్రీకాంత్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు