-

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

28 Nov, 2023 06:58 IST|Sakshi

గజ్వేల్‌రూరల్‌: వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం కాటన్లను ఎన్నికల పర్యవేక్షణ నిఘా అధికారులు పట్టుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎన్నికల నిఘా అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళికి చెందిన వాహనంలో నాలుగు కాటన్ల బీర్లు, మూడు కాటన్ల బ్లెండర్స్‌ ప్రైడ్‌ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఆదివారం రాత్రి మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ రొట్టెల రాందాస్‌కు చెందిన వాహనంలో సైతం పదమూడు కాటన్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు