-

విపక్షాలవి మోసపూరిత హామీలు

28 Nov, 2023 06:58 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి రాధాకృష్ణశర్మ

చిన్నకోడూరు(సిద్దిపేట)/నంగునూరు: కాంగ్రెస్‌, బీజేపీలవి మోసపూరిత హామీలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గంగాపూర్‌లో ఎస్సీ కుల సంఘం బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్‌ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, సర్పంచ్‌ లింగారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు భారీ మెజార్టీ సాధించేలా కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేయాలని బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అద్యక్షుడు లింగంగౌడ్‌ పిలుపునిచ్చారు. సోమవారం నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మగ్ధుంపూర్‌, రాంపూర్‌ గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో లింగంగౌడ్‌ పాల్గొని ఎన్నికల మెనిఫేస్టోను ప్రజలకు వివరించారు.

సిద్దిపేటలో జోరుగా ప్రచారం

సిద్దిపేటజోన్‌/సిద్దిపేటఅర్బన్‌: పట్టణంలో ఆయా వార్డులో సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కనకరాజుతో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు కవిత, సురేష్‌, మోహిజ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, సుందర్‌, విఠోభ, మల్లికార్జున్‌, వజీర్‌ రఘురాం, సాయి ఈశ్వర్‌, ఎల్లం, దీప్తి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అలాగే సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవోదయ మాదిగ సంఘం సభ్యులు మంత్రి హరీశ్‌రావుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి వైస్‌ ఎంపీపీ అల్లం ఎల్లం, సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌కు అందజేశారు.

మరిన్ని వార్తలు