-

ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి

28 Nov, 2023 06:58 IST|Sakshi
గజ్వేల్‌లో మాట్లాడుతున్న దేవీ రవీందర్‌

గజ్వేల్‌: ‘రైతు బంధు’ డబ్బులు రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌, బీజేపీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌ పిలుపునిచ్చారు. సోమ వారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు రైతుల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక ఆ రెండు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. డిసెంబర్‌ 3 తర్వాత కేసీఆర్‌ మూడోసారి హ్యాట్రిక్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీని తర్వాత ప్రభుత్వ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు క్రిష్ణాగౌడ్‌, ఎంపీటీసీ ఆంజనేయులు, కౌన్సిలర్‌ చందు పాల్గొన్నారు.

ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌

ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌

మరిన్ని వార్తలు