-

ఓడిపోతామనే కేసీఆర్‌ కుట్రలు

28 Nov, 2023 06:58 IST|Sakshi
మాట్లాడుతున్న తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్‌: గజ్వేల్‌, కామారెడ్డిలో ఓడిపోతానని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతో కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను ప్రజల్లో బద్నామ్‌ చేయడానికి పత్రికల్లో నిత్యం ‘రక్త చరిత్ర’ పేరిట ప్రకటనలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇదే క్రమంలో మంగళవారం గజ్వేల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ కేసీఆర్‌, హరీశ్‌రావులు కోడి కత్తి దాడి చేయించుకుని... దానిని కాంగ్రెస్‌పై నెట్టేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దాడి తర్వాత తన ఇంటిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఉసిగొలిపే ప్రమాదం ఉందన్నారు. దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం చేసి ప్రజలను నమ్మించడంలో విఫలమయ్యారని తెలిపారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి

మరిన్ని వార్తలు