-

మత్స్యకారుల మద్దతు బీఆర్‌ఎస్‌ పార్టీకే..

28 Nov, 2023 06:58 IST|Sakshi

గజ్వేల్‌రూరల్‌: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పాండవుల చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెరువులు, కుంటలలో చేప పిల్లలను వదులుతూ మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మత్స్యకార సంఘం సభ్యత్వం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, గ్రామాల్లో ముదిరాజ్‌ భవనాల నిర్మాణం చేపట్టారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత పనులు చేపట్టి... కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను నింపారన్నారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్‌లను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించగా... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. ఐదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 500 కోట్ల వ్యయంతో చేప పిల్లలను పంపిణీ చేయగా... ప్రతియేటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. చేపలను మార్కెటింగ్‌ చేసేందుకు ఫోర్‌, టూ వీలర్‌ వాహనాలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్‌ ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు కొంటమైన నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు