-

రాముని బండలో కార్తీక పూజలు

28 Nov, 2023 06:58 IST|Sakshi
పూజలు చేస్తున్న ప్రతాప్‌రెడ్డి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం జంగంరెడ్డిపల్లిలోని రామునిబండ శ్రీకోదండ సీతా రామచంద్రస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఆలయంలోని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్పంచ్‌ దంపతులతో పాటు మరో పది జంటలు సత్యనారాయణ వత్రాలు ఆచరించారు. మహిళలు దీపారాధన చేశారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ చైర్మన్‌ రంగారెడ్డి, నరేష్‌, కుమార్‌, పావని, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు