తూప్రాన్‌లో ఫ్లాగ్‌మార్చ్‌

29 Nov, 2023 04:36 IST|Sakshi

తూప్రాన్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు తూప్రాన్‌ మున్సిపల్‌ కేంద్రంలో మంగళవారం ప్రత్యేక బలగాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికల నియామావళిని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ శివానందం పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో

సౌకర్యాలు

హత్నూర(సంగారెడ్డి): పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సెక్టోరియల్‌ అధికారి భూపుత్ర అన్నారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రమైన హత్నూర, కాసాల, బ్రాహ్మణగూడ, గోవిందరాజు పల్లి గ్రామాలలోని పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాలలో నీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, సౌకర్యంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను మంగళవారం ఎంపీడీఓ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. మొత్తం 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌, తాగు నీరు, ర్యాంప్‌ల సౌకర్యాలను పరిశీలించారు.

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

జిన్నారం(పటాన్‌చెరు): మున్సిపల్‌ పరిధిలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బొల్లారం మున్సిపల్‌ కమిషనర్‌ సంగారెడ్డి సూచించారు. మండలంలోని బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని బీఎల్‌ఓలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఆర్వో శ్రీధర్‌తో పాటు బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

బయోమెట్రిక్‌ లింక్‌ చేసుకోండి

నారాయణఖేడ్‌: భారత్‌గ్యాస్‌ వినియోగదారులు డిసెంబర్‌ 31వ తేదీలోపు గ్యాస్‌ కనెక్షన్‌ను ఆధార్‌, బయోమెట్రిక్‌తో లింక్‌ చేసుకోవాలని ఖేడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ మహిపాల్‌రెడ్డి తెలిపారు. లింక్‌ చేసుకోకపోతే గ్యాస్‌ సరఫరా నిలిచిపోతుందని అన్నారు.

మరిన్ని వార్తలు