ఓటు హక్కును వినియోగించుకోవాలి

29 Nov, 2023 04:36 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రూపేష్‌
కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

సంగారెడ్డి టౌన్‌: ఓటుహక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. మంగళవారం ఎస్పీ రూపేష్‌ తో కలిసి కలెక్టరేట్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో మొత్తం 1609 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామని, మొత్తం 13, 93,711 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిషేధించామని, ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. 28 సాయంత్రం 5 గంటల నుంచి ఇతర జిల్లాల వ్యక్తులు జిల్లాలో ఉండకూడదన్నారు. అలాగే ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధించినట్లు తెలిపారు. జిల్లాలో మద్యం షాపులు మూసియాలని, డ్రైడేగా ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర శాసన సభకు ఈనెల 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 29వ తేదీ కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ స్థానికంగా ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఎస్పీ రూపేష్‌ మాట్లాడుతూ 4800 సిబ్బంది, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సిబ్బంది కేటాయింపు పూర్తి

ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఆయా కేంద్రాలకు కేటాయించినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తెలిపారు. ఐదు నియోజక వర్గాల్లో ప్రత్యేక మహిళా పోలింగ్‌ కేంద్రాలు, పీడబ్ల్యూడీ, యూత్‌ మేనేజ్‌మెంట్‌, మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అబ్జర్వర్లకు వివరించారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్‌ సింగ్లా, పవన్‌ కుమా ర్‌, నాజీమ్‌ జై ఖాన్‌, అదనపు కలెక్టర్‌ మాధురి, మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్‌ అధికారి విజయ్‌ కుమార్‌, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు