నా కట్టె కాలే వరకు మీతోనే..

29 Nov, 2023 04:36 IST|Sakshi
ప్రజలకు అభివాదం చేస్తున్న చింతా ప్రభాకర్‌

గంజ్‌ మైదానంలో భావోద్వేగానికి

గురైన చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి: ‘నా తుది శ్వాస వరకు మీ తోనేనని .. నేను బతుకుతానో.... చనిపోతానోననే పరిస్థితిలో ఉన్న నా కోసం మీరందరూ ఆలయాలు, చర్చి, మసీదులో ప్రార్థనలు చేశారు.. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది’ సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నాడు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా పట్టణంలోని ఐటీఐ నుంచి గంజ్‌ మైదానం వరకు గులాబీ శ్రేణులు బైక్‌ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. ఇందులో చింతా ప్రభాకర్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ప్రచార రథం పైనుంచి చింత ప్రభాకర్‌ ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం చింతా మాట్లాడుతూ.. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనిదన్నారు. తనకు ఇది చివరి అవకాశమని, చివరి కట్టె కాలేంతవరకు ప్రజల మధ్యలోనే ఉంటానని కంటతడి పెట్టుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో శాయశక్తులా కృషి చేస్తానని, జనమే తన బలం.. బలగమని తెలిపారు.

మరిన్ని వార్తలు