బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

29 Nov, 2023 04:36 IST|Sakshi
కుండను తయారు చేస్తున్న భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌: రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ఖేడ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి కోరారు. పంచగామ, మున్సిపాలిటీ పరిధిలోని మన్సుర్‌పూర్‌, మంగల్‌పేట్‌ కుమ్మరివాడలో ప్రచారం నిర్వహించారు. అనంతరం శివాజీచౌక్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనా నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, కౌన్సిలర్లు స్వప్న అభిషేక్‌ షెట్కార్‌ పాల్గొన్నారు.

ఖేడ్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి

మరిన్ని వార్తలు