ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

29 Nov, 2023 04:36 IST|Sakshi
సిబ్బందితో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి దేవుజా, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి

జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం డీఆర్‌డీఏ జిల్లా పీడీ జయశ్రీరాజ్‌ సందర్శించారు. కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రైతు లకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రా ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా చేసిన ధాన్యాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

పిల్లలకు పౌష్టికాహారం

అందించాలి

సంగారెడ్డి టౌన్‌: పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు సిబ్బందికి సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని శిశుగృహా న్ని సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. ఆయాలు భోజనం తినిపిస్తున్నారా అంటూ ఆరా తీశారు. చలికాలం పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. చిన్నారుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల సిబ్బంది ఆందోళన

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు ఆర్వో(రిటర్నింగ్‌ ఆఫీస్‌) కార్యాలయం ఎదుట ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇక్కడ నివాసం ఉంటూ వేరే జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది తమకు పోలింగ్‌ బ్యాలెట్‌ ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. చాలా మంది సిబ్బంది ఓటు వినియోగించు కోకుండానే వెనుదిరిగారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ శరత్‌కుమార్‌కి తెలియజేయడంతో వారికి కూడా పోలింగ్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది ఆందోళన చేస్తున్నారని తెలిసి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఆర్వో దేవుజా హుటాహుటిన వచ్చి పోలింగ్‌ బ్యాలెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన సద్దుమణిగింది. పోలింగ్‌ బ్యాలెట్‌ తీసుకొని సిబ్బంది ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నారు. దీనిపై ఆర్‌ఓను వివరణ కోరగా సిబ్బంది పనిచేసే చోట ఫాం–12 దరఖాస్తు చేసుకోలేదని, దీంతో పోలింగ్‌ బ్యాలెట్‌ ఇవ్వలేకపోయామన్నారు.

మరిన్ని వార్తలు